వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం `సీత`. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా రిలీజ్ డేట్ను ప్రకటించారు. శ్రీనివాస్, కాజల్ జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. తేజ ఈ సినిమాను అన్నీ అంశాల కలయికతో పెర్ఫామెన్స్ ప్రధానంగా రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్ర ధారులు. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, శిర్షా రే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనీల్ సుంకర సారథ్యంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా రూపొందుతుంది.